Kitchenvantalu

Kitchen Tips:ప్రతి ఇల్లాలు తప్పనిసరిగా తెలుసుకోవలసిన వంటింటి చిట్కాలు.. పని సులభం అవుతుంది

Useful Kitchen Tips in Telugu:అన్నం వండినప్పుడు మెత్తగా అయ్యిపోతూ ఉంటుంది. ఆలా మెత్తగా అవ్వకుండా అన్నం పొడి పొడిగా రావాలంటే అన్నం వండేటప్పుడు కొంచెం వంట నూనెను వేసి వండితే అన్నం పొడి పొడిగా మెతుకు మెతుకు అతుక్కోకుండా పొడిగా ఉంటుంది.

కాకరకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టిన ఒకోసారి పండిపోతూ ఉంటాయి. ఆలా పండి పోకుండా కాకరకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కాకరకాయను ఈ విధంగా కట్ చేసి నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

వంటగదిలో చీమలు సాధారణంగా వస్తూనే ఉంటాయి. ఒక పట్టాన పోవు. చీమలు పోవాలంటే ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది.  దోసకాయను కట్ చేసి దోసకాయ ముక్కను చీమలు ఉన్న ప్రదేశంలో పెడితే చీమలు పారిపోతాయి.

వంటగదిలో ఏ పని చేస్తున్న ఈగలు వచ్చేస్తుంటాయి. ఈగలు ఒక్కసారి వచ్చాయంటే ఒక పట్టానా పోవు. ఈ వేసవిలో అయితే ఈగలు చాలా ఎక్కువగా వస్తాయి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈగలు పోవాలంటే ఈ చిట్కా చాలా బాగా సహాయాపడుతుంది. ఈగలు ఉన్న ప్రదేశంలో పసుపు నీటిని జల్లితే ఈగలు రావు.

బొద్దింకలతో  ఇబ్బందిగా ఉంటె ఈ చిట్కా బాగా యూజ్ అవుతుంది. వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చిగా దంచి నీటిలో కలిపి బొద్దింకలు ఉన్న ప్రదేశంలో పెడితే ఆ ఘాటుకి బొద్దింకలు పారిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Click Here To Follow Chaipakodi On Google News