Under eye dark circles: కంటి చుట్టూ నల్లటి వలయాలు.. ఏం చేసినా తగ్గట్లేదా? ఇవి రాసుకోండి.
Under eye dark circles: ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా ఫాలో అవ్వాలి.
మారిన జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కంటి కింద నల్లటి వలయాలతో బాధపడుతున్నారు. కంటి కింద నల్లని వలయాలు కనపడగానే మార్కెట్లో దొరికే ఏదో ఒక క్రీమ్ వాడేస్తూ ఉంటారు. అలా కంగారు పడవలసిన అవసరం లేదు.
మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులతో కంటి కింద నల్లటి వలయాలను తొలగించుకోవచ్చు. ఈ చిట్కా కోసం గ్లిజరిన్, విటమిన్ E capsule ఉపయోగిస్తున్నాం.గ్లిజరిన్, విటమిన్ E capsule రెండు మెడికల్ షాప్ లో అందుబాటులో ఉంటాయి.
నల్లని వలయాలను తొలగించుకోవటానికి పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో తగ్గించుకోవచ్చు. ఒక బౌల్ లో ఒక స్పూన్ గ్లిజరిన్, ఒక విటమిన్ E capsule లోని ఆయిల్ వేసి బాగా కలిపి రాత్రి సమయంలో నల్లని వలయాలు ఉన్న ప్రదేశంలో రాసి అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం సాదరణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారం రోజులు చేస్తే కంటి కింద నల్లని వలయాలు అన్నీ తొలగిపోతాయి. ఇంటి చిట్కాలు కాస్త ఓపికగా చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ చిట్కా ఫాలో అయ్యి కంటి కింద నల్లని వలయాలను తొలగించుకోండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.