Allam Pachadi : ఏ టిఫిన్లలోకైనా అల్లం పచ్చడి కమ్మగా ఉండాలంటే ఇలా చేయండి..
Allam Pachadi : ఏ టిఫిన్లలోకైనా అల్లం పచ్చడి కమ్మగా ఉండాలంటే ఇలా చేయండి..చాలా రుచిగా ఉంటుంది.
కావలసిన పదార్దాలు
అల్ల౦ – 100 గ్రాములు
ఉప్పు – ఒకకప్పు
కార౦ – కప్పు
ఆవాలు- పావుకప్పు
మె౦తులు- పావుకప్పులోసగ౦
చి౦తప౦డు – 50 గ్రాములు
నూనె – పావు కిలో
ఇ౦గువ -తగిన౦త
బెల్ల౦ – 50 గ్రాములు
తయారుచేసే విధానం
అల్లంను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి తడి పోయే వరకు బాగా ఆరబెట్టాలి. మెంతులను దోరగా వేగించి పక్కన పెట్టాలి. చల్లారిన మెంతులు,ఆవాలు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పొడిలో కారం,ఉప్పు కలపాలి. నూనెలో ఇంగువ వేసి కాచి చల్లార్చి పక్కన ఉంచాలి.
అల్లంముక్కలు,చింతపండు కలిపి మిక్సీ చేయాలి. తర్వాత దీనిలో బెల్లం వేసి మరల ఒకసారి మిక్సీ చేయాలి. దీనిలో పైన తయారుచేసుకున్న మెంతులు,ఆవాల పొడిని కూడా వేసి మరల ఒకసారి మిక్సీ చేయాలి. ఇప్పుడు మిక్సీ చేసిన ఈ మిశ్రమాన్ని కాచి చల్లార్చిన నూనెలో కలపాలి. అంతే అల్లం పచ్చడి రెడీ అయినట్లే. ఇది ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది.