Beauty Tips

Beauty Tips: పాదాల పగుళ్లు పోవాలంటే.. ఇంట్లోనే ఉండి ఇలా చేయొచ్చు

Cracked Heels In Telugu : ఒకప్పుడు పాదాల పగుళ్ళు అనేవి చలికాలంలో మాత్రమే ఉండేవి. కానీ మారిన పరిస్థితి కారణంగా కాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోను పాదాల పగుళ్ళు అనేవి కనిపిస్తున్నాయి.

పాదాల పగుళ్లు అనేవి వయస్సుతో సంబందం లేకుండా అన్ని వయస్సుల వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పాదాల పగుళ్లు ఏర్పడినప్పుడు ఎర్రగా కమిలి అందవిహీనంగా కనపడటమే కాకుండా కొన్ని సార్లు నొప్పి కూడా వస్తుంది. పాదాల పగుళ్ల సమస్య చలికాలంలో ఎక్కువగా ఉంటుంది.

ఈ సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదు. పాదాల సంరక్షణకు తప్పనిసరిగా ప్రత్యేక శ్రద్ధ అవసరం. అప్పుడే మన పాదాలు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. పాదాల పగుళ్ళు ఏర్పడినప్పుడు ఖరీదైన క్రీమ్ లు వాడవలసిన అవసరం లేదు. కాస్త శ్రద్ద పెట్టి ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా బాగా పనిచేస్తాయి.

ఒక కొవ్వొత్తిని తీసుకొని తురమాలి. ఒక స్పూన్ కొవ్వొత్తి తురుమును ఒక బౌల్ లోకి తీసుకొని దానిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి డబుల్ బాయిలింగ్ పద్దతిలో వేడి చేయాలి. ఆ తర్వాత పొయ్యి మీద నుంచి దించి ఒక విటమిన్ E capsule లోని oil ని వేసి బాగా కలిపి రాత్రి సమయంలో పగుళ్లు ఉన్న ప్రదేశంలో రాయాలి.

రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా 2 రోజులు చేస్తే సరిపోతుంది. పాదాల పగుళ్లు ఎక్కువగా ఉంటే ఎక్కువ రోజుల సమయం పడుతుంది. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.