Kitchenvantalu

Carrot Rice:క్యారెట్ రైస్.. లంచ్ బాక్స్ లోకి 5నిమిషాల్లో టేస్టీగా రెడీ|

Carrot Rice |లంచ్ బాక్స్ లోకి 5నిమిషాల్లో టేస్టీగా రెడీ..కావలసిన పదార్ధాలు,తయారి విధానం తెలుసుకుందాం.

కావలసిన పదార్దాలు
వండిన అన్నం – 2 కప్పులు
తురిమిన క్యారట్ – 1 కప్పు
ఉల్లిపాయ -1
పచ్చిమిరపకాయలు -2
యాలకులు – 2
లవంగాలు – 4
దాల్చిన చెక్క – 1″ ముక్క
షాజీర – 1/2 స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ -1/2 స్పూన్
కరివేపాకు -1 రెమ్మ
కొ్త్తిమిర – 2 రెమ్మలు
ఉప్పు – తగినంత
నూనె – 1 స్పూన్

తయారి విధానం
అన్నం మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉండేలా వండాలి. బాణలిలో నూనె పోసి వేడెక్కాక సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు , కరివేపాకు వేసి కొంచెం సేపు వేగించాలి.

ఆ తర్వాత లవంగాలు,యాలకులు, దాల్చిన చెక్క, షాజీర ,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూడు నిమిషాలు వేగించాలి. తురిమిన క్యారట్ వేసి తడి పోయేంతవరకు వేగించాలి. పొడి పొడిగా ఉన్న అన్నంను ఇందులో కలపాలి. సరిపడ ఉప్పు, సన్నగా కోసిన కొత్తిమిర వేసి బాగా కలిపి కొంచెం సేపు వేగించి దింపాలి.