Hair Tips at Home: ఈ హోమ్ రెమిడీస్ తో హెయిర్ ఫాల్ ను నెల రోజుల్లో తగ్గించుకోండి!
Curry leaves and Curd Hair Fall Home Remedies: జుట్టు సంరక్షణలో పెరుగు,కరివేపాకు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. వీటిని పురాతన కాలం నుండి వాడుతున్నారు.
ఈ మధ్యకాలంలో జుట్టురాలే సమస్య ప్రతి ఒక్కరి లోనూ కనిపిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టురాలే సమస్యకు మార్కెట్లో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించడం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మనకు ఇంటిలో సహజసిద్ధంగా దొరికే పదార్థాలతో మనం జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.
ఇంటి చిట్కాలు చాలా సమర్థవంతంగా పని చేస్తాయి. దీనికోసం కరివేపాకులు తీసుకోవాలి. సాదరణంగా ప్రతి ఇంటిలోనూ కరివేపాకు ఉంటుంది. కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ చుండ్రు సమస్యను తగ్గించి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా తెల్ల జుట్టు సమస్యను కూడా తగ్గిస్తుంది.
గుప్పెడు కరివేపాకు ఆకులను తీసుకుని దానిలో రెండు స్పూన్ల పెరుగు వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా తెల్లజుట్టు సమస్య కూడా ఉండదు. చాలా తక్కువ ఖర్చుతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.