Kitchenvantalu

Ac Power Saving Tips:ఈ టిప్స్ పాటిస్తే చాలు.. ఏసీ ఎంత వాడినా కరెంట్ బిల్ తక్కువే..

Ac Power saving Tips in telugu:వేసవి కాలం ప్రారంభం అయింది. ఎండ కారణంగా చెమటలు పట్టటం కూడా ప్రారంభం అయింది. కామన్ గా ప్రతి ఒక్కరూ Ac వేసుకోవటం ప్రారంభిస్తారు. అయితే Ac ఎక్కువగా వాడితే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ఈ tips ఫాలో అయితే కరెంట్ బిల్ తక్కువగా వస్తుంది.

ఏసీ ని ఎప్పుడు తక్కువ టెంపరేచర్ వద్ద సెట్ చేయకూడదు. మనలో చాలామంది ఏసీని 16 లేదా 18 డిగ్రీల వద్ద ఉంచితే మంచి కూలింగ్ వస్తుందని ఎక్కువగా అలానే పెడుతూ ఉంటారు. కానీ ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీలు వద్ద ఉంచాలి. అప్పుడు విద్యుత్తు చాలా వరకు ఆదా అవుతుంది.

వేసవి కాలానికి ముందు చలికాలంలో కూడా అప్పుడప్పుడు ఏసీ ఆన్ చేస్తూ ఉండాలి. అలాగే వేసవికాలం ప్రారంభం కాగానే ఒక్కసారి ఏసీ ని సర్వీసింగ్ చేయించి వాడాలి. సర్వీసింగ్ చేయించకపోతే దుమ్ము ధూళి ఉండటం వలన ఏసీ ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. ఏసీ ఎక్కువగా పని చేస్తే కరెంట్ బిల్లు కూడా ఎక్కువగానే వస్తుంది.

ఏసీ ఆన్ చేయటానికి ముందే గది తలుపులు, కిటికీలు మూసేయాలి. అప్పుడు వేడిగాలి గదిలోకి ప్రవేశించదు. అలాగే గదిలోని చల్లని గాలి బయటకు వెళ్ళదు. ఒకవేళ తలుపులు, కిటికీలు సరిగా వేయకపోతే ఏసీ ఎక్కువగా పని చేయాల్సి వచ్చి కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ చిట్కాలను పాటిస్తే కరెంట్ బిల్ తక్కువగా వస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.