Kitchenvantalu

Aloo rice with Leftover rice:అన్నం మిగిలిపోయిందా?అయితే ఈ రెసిపీ ట్రై చేయండి

Aloo rice with Leftover rice: మనం ఎంత కరెక్ట్ గా వంట చేసిన అప్పుడప్పుడు అన్నం మిగిలి పోతుంది. అలాంటప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి.

కొంచెం ఆలోచిస్తే, మిగిలిపోయిన అన్నాన్ని, ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. బంగాళ దుంపతో కాని, కలిపి చేసారంటే, అది మిగిలిపోయిన అన్నం అన్న సంగతి మర్చిపోతారు.

కావాల్సిన పదార్ధాలు
పుదీనా – 1 కట్ట
కొత్తిమీర – 1 కట్ట
వెల్లుల్లి – 5 రెబ్బలు
అల్లం – ½ ఇంచ్
పచ్చిమిచ్చి – 4
ఉప్పు – తగినంత
పెరుగు – 3 టేబుల్ స్పూన్
నిమ్మరసం – 1 చెక్క

రైస్ కోసం..
నూనె – 3 టేబుల్ స్పూన్స్
ఆలు – 150 గ్రాములు
ఉల్లిపాయ – 1
కరివేపాకు రెబ్బ – 1
టమాటోముక్కలు – 1
జీలకర్ర పొడి – 1/2టీ స్పూన్
కారం – 1 టీస్పూన్
ఉడికించిన అన్నం – 1 కప్పు

తయారీ విధానం
1.ఒక మిక్సీ జార్ తీసుకుని, కొత్తిమీర పేస్ట్ కోసం, పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి,. పెరుగు, నిమ్మరసం వేసి, కొద్దిగా నీళ్లు కలుపుకుని, మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని, నూనె వేడి చేసి బంగాళ దుంపలు వేసి, కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి.
3. వేగిన ఆలు ముక్కల్లో ఉల్లిపాయలు వేసి, మెత్తపడనివ్వాలి.
4. తర్వాత అందులోకి టమాటో ముక్కలు వేసుకుని మీడియం ఫ్లేమ్ పై మగ్గనివ్వాలి.

5. టమాటాలు మగ్గిన తర్వాత, కారం, జీలకర్ర, పొడి వేసి నూనె పైకి తేలేవరకు వేపుకోవాలి.
6. అది వేగిన తర్వాత పుదీనా పేస్ట్ వేసి చిక్క పడే దాకా ఫ్రై చేసుకోవాలి.
7. చిక్కపడిన పుదీనా పేస్ట్ లో అన్నం వేసి, హై ఫ్లైమ్ పై కలుపుతూ, అన్నానికి పేస్ట్ పట్టేలా మిక్స్ చేసుకోవాలి.
8. హై ఫ్లేమ్ పై రెండు నిముషాలు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆలు రైస్ రెడీ అయినట్లే..
Click Here To Follow Chaipakodi On Google News