Rava Gulab Jamun:రవ్వ తో ఇలా గులాబీ జామున్ చేస్తే.. జ్యుసిగా టేస్టీ గా తినేయచ్చు
Rava Gulab Jamun:రవ్వ తో ఇలా గులాబీ జామున్ చేస్తే.. జ్యుసిగా టేస్టీ గా తినేయచ్చు..స్వీట్ అంటే ఇష్టం లేని వారు ఉండరు. అందరు ఇష్టపడే స్వీట్ గులాబ్ జామూన్.ఇన్ స్టంట్ గా దొరికే మిశ్రమంతో కాకుండా ఇంట్లో వుండే రవ్వ చక్కెరతో స్మూత్ అండ్ టేస్టీ గులాబ్ జామూన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
రవ్వ – 1 కప్పు
చక్కెర – 2 కప్పులు
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
నీళ్లు – 2 కప్పులు
పాలు – 2 కప్పులు
యాలకుల పొడి – 1 టీ స్పూన్
నూనె – డీప్ ఫ్రై కి సరిపడా
తయారీ విధానం
1.జామున్ ల కోసం ముందుగా సిరప్ తయారు చేసుకోవాలి.
2.ప్యాన్ వేడి చేసి అందులోకి రెండు కప్పుల నీళ్లు,రెండు కప్పుల చక్కెర వేసి మరిగించుకోవాలి.
3.లోఫ్లేమ్ పై పదినిమిషాలు మరిగించాక అందులోకి యాలకులు పొడి వేసి కాసేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
4.ఇప్పుడు జామూన్స్ కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని టేబుల్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడెక్కాక రవ్వను వేసి దోరగా ఉండలు లేకుండా వేపుకోవాలి.
5.వేపుకున్న రవ్వను నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకోవాలి.
6.అందులోకి మరింత నెయ్యి వేసుకోని మెత్తగా పిండి మాదిరిగా ముద్దగా తయారు చేసుకోవాలి.
7.తయారు చేసుకున్న పిండిని చిన్న బాల్స్ లా పగుల్లు లేకుండా తయారు చేసుకోవాలి.
8.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె లో కాని నెయ్యిలో కాని డీప్ ఫ్రై చేసుకోవాలి.
9.వేపుకున్న జామూన్ లను తయారు చేసుకున్న చక్కెర సిరప్ లో వేసుకోవాలి.
10.చల్లారిన సిరప్ ను మల్లీ వేడి చేసుకోని స్టవ్ ఆఫ్ చేసుకోని గంట తర్వాత సర్వ్ చేసుకుంటే జామూన్ లు చాలా సాఫ్ట్ గా వస్తాయి.