White Hair: చిన్న వయసులోనే జుట్టు తెల్లగా ఉందా..? మీ సమస్యకు ఇదిగో పరిష్కారం
White hair Home remedies in telugu:ఈ మధ్య కాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. మారిన జీవనశైలి పరిస్థితి, పోషకాహార లోపం వంటి అనేక రకాల కారణాలతో చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు వచ్చేస్తుంది. అలా తెల్లజుట్టు వచ్చినప్పుడు ప్రారంభంలోనే కంగారూ పడకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక కప్పు కొబ్బరి నూనె,ఒక కప్పు గుంటకలగర ఆకు రసం,నాలుగు ఎర్ర మందార పువ్వలు వేసి బాగా మరిగించాలి. నీరు అంతా ఇగిరిపోయి నూనె తేలేవరకు మరిగించాలి. ఈ నూనెను వడకట్టి జుట్టుకి రాయాలి. ఈ నూనెను ప్రతి రోజు రాసుకొని రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకుంటూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
అంతేకాకుండా జుట్టు రాలకుండా బలంగా,ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. తెల్ల జుట్టు తక్కువగా ఉంటే తక్కువ రోజుల్లోనే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. అదే తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే మాత్రం కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది. తెల్ల జుట్టు ఎక్కువ ఉన్నవారు కాస్త ఓపికగా ఈ రెమిడీని ఫాలో అవ్వాలి.
రసాయనాలు ఉన్న హెయిర్ డ్రై లు కన్నా సహజసిద్ధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ చిట్కా బెటర్ కదా. కాస్త సమయాన్ని కేటాయిస్తే చాలా సమర్ధవంతంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.