Face Glow Tips:ఇలా చేస్తే 10 నిమిషాల్లో నల్లని మచ్చలు అన్ని తొలగిపోయి ముఖం మెరిసిపోతుంది
Rice flour for Face Tips : ముఖ సంరక్షణలో ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి పలితాన్ని పొందవచ్చు. మార్కెట్ లో దొరికే ఉత్పత్తులు కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ముఖం మీద మచ్చలు లేకుండా తెల్లగా కాంతివంతంగా మెరవాలంటే ఖరీధైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో ఉన్న కొన్ని సహజసిద్దమైన పదార్ధాలతో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. దీని కోసం కేవలం 5 ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. అన్నీ సులభంగా అందుబాటులో ఉండేవే.
ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ బియ్యంపిండి, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ బాదం ఆయిల్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక స్పూన్ గోరువెచ్చని నీటిని పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక ముఖం మీద నీటిని జల్లుతూ రబ్ చేస్తూ కడగాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. కాఫీ పౌడర్ ఏ కంపెనీ అయినా పర్వాలేదు. కాఫీ ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది. బియ్యంపిండి చర్మం మీద మలినాలను, మృత కణాలను తొలగిస్తుంది. ఆలివ్ ఆయిల్, బాదం నూనెలో ఉన్న పోషకాలు చర్మానికి పోషణ అందిస్తాయి.
ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయి. తప్పకుండా ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.