Healthhealth tips in telugu

Mouth Ulcers Remedy: నోటి పూతతో బాధపడుతున్నారా..? ఈ టిప్స్‌ ఫాలో అయితే త్వరగా తగ్గుతాయ్‌..!

Mouth Ulcers Remedy: నోటి పూతతో బాధపడుతున్నారా..? ఈ టిప్స్‌ ఫాలో అయితే త్వరగా తగ్గుతాయ్‌..సాధారణంగా మనలో ప్రతి ఒక్కరు ఎదో ఒక సమయంలో నోటి పూత సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ నోటి పూత రావటానికి చాలా కారణాలు ఉంటాయి. ఏ కారణం చేత వచ్చిన ఈ నోటి పూత కారణంగా ఏ ఆహారం తీసుకోవాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది.

నోటి పూత అనేది నోట్లో పెదాల లోపలి వైపు,నాలుక మీద, బుగ్గల లోపలి వైపు పుండ్లు ఏర్పడతాయి. ఏమి తినాలన్న,ఏమి త్రాగాలన్న ఇబ్బందే. ముఖ్యంగా కారంగా ఉండే పదార్ధాలు తింటే ఆ బాధను చెప్పలేము. నోటి పూత రావటానికి నోరు అశుభ్రంగా ఉండటం,వేడి చేయటం,పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం,వ్యాధి నిరోధకశక్తి క్షీణించి నోట్లో వుండే సూక్ష్మక్రిములు బాగా అభివృద్ధి చెందినప్పుడు వస్తాయి.

నోటి పూత తగ్గటానికి ఒక అద్భుతమైన ఇంటి చిట్కా ఉంది. ఈ చిట్కా ఫాలో అయితే రెండు రోజుల్లోనే నోటి పూత తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గకపోతే నోటి పూత రావటానికి వేరే ఏమైనా కారణాలు ఉన్నాయేమో అని డాక్టర్ ని తప్పనిసరిగా సంప్రదించాలి. అశ్రద్ధ చేయకూడదు.

ఒక బౌల్ లో అరస్పూన్ పసుపు వేసి దానిలో తేనె కలిపి నోటి పూత ఉన్న ప్రదేశంలో రాసి అరగంట అయ్యాక శుభ్రం చేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ తేనెలో పావుస్పూన్ లో సగం పసుపు వేసి తాగాలి. ఈ విధంగా 2 రోజులు చేస్తే నోటి పూత నుండి ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.