Kitchenvantalu

Useful Kitchen Tips:ఇంత వరకు ఎవరూ చెప్పని కొత్త వంటింటి చిట్కాలు

Useful Kitchen Tips:ఇంత వరకు ఎవరూ చెప్పని కొత్త వంటింటి చిట్కాలు..బాదం పప్పు తొక్క తొందరగా రావాలంటే.. మరిగే నీళ్లల్లో బాదం పప్పులు వేసి పది నిమిషాలు ఉంచిన తర్వాత తీస్తే చాలా సులభంగా తొక్క వచ్చేస్తుంది.

ఫ్లవర్ వాజ్ లో పువ్వులు పెడుతూ ఉంటాం. అవి తొందరగా వాడిపోతు ఉంటాయి. అలా వాడిపోకుండా తాజాగా ఉండాలంటే అందులో పోసే నీటిలో కాస్త ఉప్పు వేయాలి.

దంతాలు ఒక్కోసారి పసుపు రంగులోకి మారతాయి. పసుపు రంగులోకి మారిన దంతాలు తెల్లని రంగులోకి మారాలంటే దంతాలపై నిమ్మ చెక్కను రుద్దాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తే దంతాలు క్రమంగా తెల్లగా మారతాయి.

కొద్ది రోజులు వాడిన తర్వాత ఫ్లాస్కులు వాసన వస్తాయి. ఈ వాసన పోవాలంటే వెనిగర్ కలిపిన వేడి నీటిని ఫ్లాస్కులో పోసి అందులో గుడ్డు పెంకులను వేసి నాలుగైదు గంటలు అలాగే ఉంచితే ఆ దుర్వాసన పోతుంది.

పాలరాతి మీద కూరగాయలు తరిగితే కత్తి పదును పోతుంది కాబట్టి చాపింగ్ బోర్డు వాడాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.