ఇంగువ-బెల్లం కలిపి తీసుకుంటే ఆ జబ్బులన్నీ పరారవ్వాల్సిందే!
jaggery with hing:ఇంగువ-బెల్లం కలిపి తీసుకుంటే ఆ జబ్బులన్నీ పరారవ్వాల్సిందే..ఇంగువ,బెల్లం రెండింటిలోను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. వాటిని తీసుకుంటే కల్గే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒక స్పూన్ బెల్లం తురుము, పావు స్పూన్ ఇంగువ,పావు స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి ఉండగా చేసుకొని తీసుకోవాలి.
ఇలా కాకుండా ఒక గ్లాసు గోరువెచ్చని నీరు లేదా పాలల్లో పావుస్పూన్ ఇంగువ,ఒక స్పూన్ బెల్లం తురుము కలిపి కూడా తీసుకోవచ్చు. బెల్లం ఆర్గానిక్ బెల్లం అయితే మంచిది. ఉదయం సమయంలో తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. శ్వాసకోశంలో అడ్డంకులు,ఛాతీ పట్టేయటం, కఫం వంటి అన్నీ రకాల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.
అలాగే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జీర్ణ సంబంద సమస్యలు గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. ఒత్తిడి,తలనొప్పి, డిప్రెషన్ వంటి సమస్యలను తగ్గించి మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఇంగువ,బెల్లం కలిపి రెగ్యులర్ గా తీసుకుంటే స్త్రీ, పురుషుల్లో ఏమైనా సంతానోత్పత్తి సమస్యలు ఉంటే తగ్గిపోతాయి.
మన వంటింటిలో ఉండే వస్తువులు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి. వాటి గురించి తెలుసుకొని వాడితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.