Beauty Tips

Hair Fall Tips:రోజుకి 1 స్పూన్ చాలు మీ జుట్టు వద్దన్నా ఒత్తుగా, పొడవుగా పెరగటం చూసి ఆశ్చర్యపోతారు

Seeds Hair Fall Tips:రోజుకి 1 స్పూన్ చాలు మీ జుట్టు వద్దన్నా ఒత్తుగా, పొడవుగా పెరగటం చూసి ఆశ్చర్యపోతారు..ప్రస్తుతం ఉన్న వాతావరణంలో మార్పులు, ఆహారంలో పోషకాహార లోపం వంటి కారణాలతో జుట్టు రాలే సమస్య ఎక్కువైంది. ఈ సమస్యను తగ్గించుకోవటానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలు తగ్గుతాయి.

ఈ చిట్కా కోసం ఒక స్పూన్ చియా సీడ్స్, ఒక స్పూన్ సన్ ఫ్లవర్ సీడ్స్, ఒక స్పూన్ ఆవిసే గింజలు, ఒక స్పూన్ నువ్వులను తీసుకొని పాన్ లో వేసి వేగించాలి. ఈ గింజలను ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు రాత్రి సమయంలో ఒక స్పూన్ గింజలను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన గింజలను తింటూ ఆ నీటిని తాగాలి.

అలా కాకుండా వేగించిన గింజలను పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో అరస్పూన్ పొడి కలిపి తాగాలి. ఈ విధంగా 15 రోజుల పాటు చేస్తే మంచి ఫలితం తప్పకుండా కలుగుతుంది. జుట్టు రాలే సమస్యకు ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. ఖరీదైన నూనెలను వాడవలసిన అవసరం లేదు.

ఈ చిట్కాలో ఉపయోగించిన గింజలలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లకు బలాన్ని అందించి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అంతే కాకుండా శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.