Sobhan Babu:శోభన్ బాబు కెరీర్ లో టాప్ 10 హీరోయిన్స్ ఎవరో చూడండి
Sobhan Babu Top 10 Heroines : అలనాటి నటుల గురించి ఏ విషయం అయినా తెలుసుకోవటానికి అభిమానులు ఎప్పుడు సిద్దంగా ఉంటారు. టాలీవుడ్ లో ఒకప్పుడు అందాల నటుడు అంటే శోభన్ బాబు అని ఠక్కున చెప్పేవారు.
ఎన్నో సినిమాల్లో నటించి, ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించిన శోభన్ బాబు ఎన్నో హిట్ మూవీస్ చేసారు. ఈయన సరసన నటించిన హీరోయిన్స్ లో బెస్ట్ జోడీగా చెప్పాలంటే,కళాభినేత్రి వాణిశ్రీ చక్కగా ఒదిగిపోయింది. గంగ మంగ, జీవనతరంగాలు,జీవనజ్యోతి,బంగారు బాబు,మైనర్ బాబు వంటి 30సినిమాల వరకూ ఇద్దరు కల్సి నటించారు.
ఇక అందాల నటి జయప్రద అయితే 20సినిమాల వరకూ శోభన్ బాబు సరసన చేసింది. స్వయంవరం,చండీప్రియ,మండెగుండెలు,సంసారం,దేవత, ఇలా పలు సినిమాలు వీరిద్దరి కాంబినేషన్ లో అలరించాయి. శాంతినిలయం,సంపూర్ణ రామాయణం,చక్రవాకం వంటి సినిమాల్లో శోభన్ బాబు సరసన చంద్రకళ జోడీ కట్టి హిట్స్ కొట్టారు.
హీరోయిన్ మంజుల కూడా శోభన్ సరసన మంచి జోడీ అనిపించుకుంది. మంచి మనసులు,జేబుదొంగ,గుణవంతుడు వంటి అరడజను సినిమాలకు పైగా కల్సి నటించారు. ఒకప్పుడు హీరోయిన్ గా ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లో దుమ్మురేపిన ఊర్వశి శారద అయితే శోభన్ బాబుతో కల్సి 20సినిమాల వరకూ చేసింది. కాలం మారింది,శారద,బలిపీఠం,కార్తీకదీపం,ఏవండీ ఆవిడ వచ్చింది వంటి సినిమాల్లో కల్సి నటించారు.
ఇక హీరోయిన్ లక్ష్మి కూడా శోభన్ బాబు సరసన కోరుకున్న మొగుడు,అందరూ దొంగలే వంటి సినిమాల్లో బెస్ట్ జోడీగా నిలిచారు. అలాగే శోభన్ బాబుతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ గా జయసుధ ను చెప్పుకోవచ్చు. సోగ్గాడు,మల్లెపూవు,ఇల్లాలు,ఇల్లాలి కోరికలు, పుణ్యం కొద్దీ పురుషుడు,మాంగళ్య బలం,జీవిత నౌక,భార్యామణి,రాజా వంటి 30 సినిమాల వరకూ ఇద్దరి కాంబోలో వచ్చాయి.
శ్రీదేవి కూడా శోభన్ బాబుకి చక్కని జోడీగా నిల్చింది. మండెగుండెలు,దేవత,కార్తీకదీపం,ఇల్లాలు వంటి సినిమాలు ఇందుకు ఉదాహరణ. మహారాజు వంటి బ్లాక్ బస్టర్ మూవీతో పాటు అనేక సినిమాల్లో సుహాసిని శోభన్ బాబు సరసన నటించింది. బావమఱదళ్ళు,ఇల్లాలు ప్రియురాలు,శ్రావణసంధ్య వంటి మూవీస్ చేసారు.
విజయశాంతి కూడా శోభన్ బాబు సరసన సూటయింది. సక్కనోడు,అభిమన్యుడు,ఊరికి సోగ్గాడు,పండంటి జీవితం,జీవన పోరాటం,శ్రీవారు ఇలా 10 సినిమాలు కల్సి నటించారు. హీరోయిన్ రాధ కూడా బాగానే సూటయింది. డ్రైవర్ బాబు,దొరగారింట్లో దొంగోడు,సోగ్గాడి కాపురం,అడవిరాజా వంటి 10 సినిమాల్లో కల్సి నటించారు.