Weight Loss Tips:చిటికెడు పొడిని ఇలా తీసుకుంటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మంచులా కరిగిపోతుంది
Weight Loss Tips:చిటికెడు పొడిని ఇలా తీసుకుంటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మంచులా కరిగిపోతుంది..ఈ రోజుల్లో బరువు పెరగటం అనేది చాలా సులభంగా జరిగిపోతుంది. కానీ తగ్గాలంటే మాత్రం అంత తేలికగా జరగదు.
బరువు తగ్గటానికి మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ అరగంట వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా బరువు తగ్గుతారు. అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది.
ఈ చిట్కా కోసం ఒక కప్పు ఆవిసే గింజలను సిమ్ లో పెట్టి దోరగా వేగించుకోవాలి. ఆ తర్వాత పావు కప్పు సొంపు, పావు కప్పు జీలకర్ర వేసి వేగించాలి. ఆ తర్వాత ఒక కప్పు కరివేపాకును వేగించాలి. వెగించిన ఆవిసే గింజలు,సొంపు,జీలకర్ర,కరివేపాకులను మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి.
ఈ పొడిని ఒక బౌల్ లో వేసుకొని రెండు స్పూన్ల పసుపు, రెండు స్పూన్ల కరక్కాయ పొడి,అరస్పూన్ ఇంగువ, అరస్పూన్ సైంధవ లవణం వేసి బాగా కలిపి సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. అరస్పూన్ పొడిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి ప్రతి రోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో తీసుకుంటే సరిపోతుంది.
ఈ పొడిని వాడిన 15 రోజుల్లోనే తేడా గమనించి ఆశ్చర్యపోతారు. ఈ పొడిలో వాడిన అన్నీ ఇంగ్రిడియన్స్ శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటంలో సహాయపడతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.