Hair growth tips: పొడవైన జుట్టు కావాలా? అయితే వీటిని ట్రై చేసి చూడండి
Hair growth tips: పొడవైన జుట్టు కావాలా? అయితే వీటిని ట్రై చేసి చూడండి..ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందికి జుట్టు రాలే సమస్య వస్తోంది. కొంత మందికి అయితే బట్టతల వచ్చేస్తోంది. ఇప్పుడు మనం జుట్టు పొడవుగా పెరగడానికి ఒక చిట్కా తెలుసుకుందాం. జుట్టుకి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది.
జుట్టు ఒత్తుగా మెరుస్తూ ఉంటుంది. ఈ రెమిడీ కోసం కేవలం మూడు ఇంగ్రిడియన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. ముఖం అందంగా ఉండాలంటే జుట్టు కూడా ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా ఉంటే ఆ అందమే వేరు కాబట్టి ప్రతి ఒక్కరు జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండాలని కోరుకుంటారు.
ఒక బౌల్ లో ఒక స్పూన్ కలోంజీ పొడిని తీసుకొని దానిలో ఒక స్పూన్ ఆలోవెరా జెల్ మరియు ఒక విటమిన్ e క్యాప్సిల్ ఆయిల్ వేసి బాగా కలిపి జుట్టుకి పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది.
జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటమే కాకుండా జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే తెల్ల జుట్టు నల్లగా మారటానికి కూడా సహాయ పడుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.