Devotional

Lord shiva abhishekam:శివునికి పొరపాటున వీటితో అభిషేకం చేస్తే ఏమి అవుతుంది

Lord Shiva Abhishekam:శివునికి పొరపాటున వీటితో అభిషేకం చేస్తే ఏమి అవుతుంది.. శివుడికి రుద్రాభిషేకం, రుద్రయాగం వంటి ప్రత్యేక పూజలు, అర్చనలు చేస్తూ ఉంటారు. ఇక కార్తీక మాసంలో లక్ష బిల్వార్చన, ప్రతినెలా మాస శివరాత్రికి ప్రత్యేక పూజలు, సోమవారం ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. విబూధితో అభిషేకం శివునికి ఎంతో ప్రీతికరం. ఇక జలాభిషేకం అయితే బోళా శంకరునికి ఎంతో ఇష్టం.

అయితే కొన్నింటితో అసలు పూజ చేయకూడదని కొందరు పండితులు చెప్పేమాట. మాములుగా అయితే పసుపు కుంకుమలతో పూజిస్తారు. కానీ శివలింగానికి ఎట్టి పరిస్థితుల్లో పసుపు, కుంకుమలను వాడకూడదట. ముఖ్యంగా త్రినేత్రుడు అని అంటారు. అందుకే మూడో కన్ను ఉండేచోట పసుపు, కుంకుమ పెట్టకూడదు.

శంఖచుడు అనే రాక్షసుణ్ణి శివుడు సంహరించాడని పురాణాలలో ఉన్నందున శంఖంలో పూసిన నీళ్లతో అభిషేకం చేయకూడదని కూడా అంటారు. అలాగే తులసి ఆకులను కూడా శివపూజకు వాడకూడదు. అలాగే మనం తాగే కొబ్బరి నీళ్లతో కూడా శివుడిని అభిషించకూడదని అంటారు. అందుకే కొబ్బరికాయ బయట కొట్టి రమ్మని చెబుతారు.