Pomegranate Seeds:దానిమ్మ గింజలను ఈ సీజన్ లో తింటే ఊహించని ప్రయోజనాలు
Pomegranate Seeds:దానిమ్మ గింజలను ఈ సీజన్ లో తింటే ఊహించని ప్రయోజనాలు.. దానిమ్మ పండు తినే విషయంలో మనకు చాలా సందేహాలు ఉంటాయి. దానిమ్మను రాత్రి సమయంలో తింటే ఏమి అవుతుంది…అనే విషయాన్నీ తెలుసుకుందాం. రాత్రి సమయంలో దానిమ్మను తీసుకుంటే జలుబు చేస్తుందని అందరూ భావిస్తారు. కానీ ఇది అపోహ మాత్రమే. దానిమ్మను ఏ సమయంలో నైనా తీసుకోవచ్చు.
pomegranate దాదాపుగా సంవత్సరం పొడవునా లభ్యం అవుతుంది. దానిమ్మలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. pomegranate ను గింజల రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. అయితే గింజలు తింటే మన శరీరానికి అవసరమైన పైబర్ అందుతుంది.
pomegranate లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, ప్రోటీన్, ఫైబర్‌తో పాటు శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి సమృద్దిగా ఉంటాయి. దానిమ్మను రాత్రి సమయంలో తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు.
అలాంటి వారికీ దానిమ్మ పండు చాలా బాగా సహాయపడుతుంది. రాత్రి సమయంలో ఒక గ్లాసు దానిమ్మరసంలో ఒక స్పూన్ అల్లం రసం కలిపి తీసుకుంటే ఎముకలు దృఢంగా మారి ఎముకలకు సంబంధించిన సమస్యలు లేకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ చలికాలంలో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందటానికి దానిమ్మ జ్యూస్ చాలా బాగా సహాయపడుతుంది.
అలాగే మనలో చాలామంది మారిన జీవనశైలి, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమి సమస్య నుండి బయట పడాలంటే రాత్రి పడుకునే ముందు ఒక కప్పు దానిమ్మ గింజల్లో కొంచెం పెరుగు కలిపి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
అంతేకాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇలా తీసుకోవడం వల్ల ఆకలి తొందరగా వేయదు. అంతేకాకుండా ఉదయం సమయంలో చాలా ఉషారుగా ఉంటారు. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ సమృద్దిగా ఉండుట వలన ధమనులలో రక్త నాళాలలో చెడు కొలెస్ట్రాల్ తొలగించి అడ్డంకులు లేకుండా రక్తప్రసరణ జరిగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది.
ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న దానిమ్మను రెగ్యులర్ గా తీసుకుంటే చాలా మంచిది. రోజుకి ఒక దానిమ్మ పండును తింటే ఎన్నో సమస్యల నుండి బయట పడవచ్చు. కాబట్టి రోజు ఒక దానిమ్మ పండును తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.