Devotional

Maha shivratri 2025: శివరాత్రి రోజు అభిషేకం ఏ విధంగా చేస్తే మంచిదో తెలుసా?

Maha Shivratri 2025 abhishekam :మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండటం వల్ల అదృష్టం, ఐశ్వర్యాన్ని పొందవచ్చు. శివ పురాణం ప్రకారం.. శివలింగంపై నీటిని సమర్పించే నియమాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శివుడు అభిషేక ప్రియుడు. అందువల్ల శివరాత్రి రోజున వీటితో శివునికి అభిషేకం చేస్తే అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు…ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. అయితే వీటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

పసుపు నీటితో శివునికి అభిషేకం చేస్తే శుభకార్యాలు జరుగుతాయి. రుద్రాక్ష జలాభిషేకం చేస్తే సకల ఐశ్వర్యాలుకలుగుతాయి. పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖ నాశనం కలుగుతుంది. పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం బాగుటుంది.

నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యువు నశించగలదు. గరిక నీటితో అభిషేకం చేస్తే నష్టపోయిన ధనం తిరిగి పొందగలరు. మారేడు బిల్వదళ జలముతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ధన ప్రాప్తి కలుగును. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములు లభించును.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ