Gaami OTT Release: ఓటీటీలోకి విజువల్ వండర్ మూవీ గామి…ఎప్పుడు.. ఎక్కడంటే?
Gaami OTT Release: మహా శివరాత్రి సందర్భంగా విశ్వక్ సేన్ నటించిన Gaami సినిమా విడుదల అయ్యి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో గామి ఓటీటీ రిలీజ్పై ఆసక్తి నెలకొంది. గామి ఓటీటీ హక్కులను (Gaami OTT Rights) ప్రముఖ సంస్థ జీ5 (ZEE5) కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
గామి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఓటీటీ సంస్థలు (OTT Platforms) భారీగానే పోటీ పడినట్లు సమాచారం. వాటన్నింటిని దాటుకుని ఫైనల్గా భారీ వ్యయం వెచ్చించి గామి ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకుందట.
అలాగే గామి సినిమాను నెల రోజుల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ (Gaami Digital Streaming) చేసేలా ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే, గామి మూవీని ఎప్రిల్ రెండో వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది.
అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేవరకు..దీనిలో ఎంత నిజం ఉందో తెలుస్తుంది. ఎందుకంటే నిన్న జీ5 (ZEE5) లో హనుమాన్ సినిమా వస్తుందని ప్రకటన చేసారు. కానీ OTT లోకి రాలేదు.