Gaami Movie:గామిలో విశ్వక్ సేన్ షాకింగ్ రెమ్యునరేషన్..
Gaami Movie:విశ్వక్ సేన్ నటించిన Gaami సినిమా నిన్న అభిమానుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. విశ్వక్ సేన్ విభిన్నమైన పాత్రలో కనిపించడం.. సైంటిఫిక్ థ్రిల్లర్ గా రావటంతో ఈ సినిమాపై ఆసక్తి కలిగింది.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ చాలా అద్భుతంగా నటించాడు. నటనకు అవకాశం ఉన్న పాత్రను ఎంచుకున్నాడు. అయితే ఈ సినిమాకి విశ్వక్ సేన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడనే విషయంపై ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి.
ఆ విషయానికి వస్తే ఈ సినిమాకు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. సినిమా తనకు మంచి పేరు తీసుకు వస్తుందనే నమ్మకంతోనే.. డబ్బుల కోసం కాకుండా తన కెరియర్ కోసం పని చేసినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.