Kitchenvantalu

Apple Storage Tips: యాపిల్స్‌ ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉండాలంటే.. ఇలా చేయండి!

Apple Storage Tips in telugu:పండ్లను నిల్వ చేసుకోవటానికి ఇప్పుడు చెప్పే చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. ముఖ్యంగా ఆపిల్స్ ని నిల్వ చేసుకోవటానికి చిట్కాలను తెలుసుకుందాం.

ఆపిల్ లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఒక్కోసారి యాపిల్స్ ధర తక్కువగా ఉందని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు వాటి మీద నల్ల మచ్చలు వచ్చి తొందరగా పాడవుతూ ఉంటాయి.

అలా కాకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇపుడు చెప్పే చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. ఆపిల్స్ ని సూర్యకాంతికి దూరంగా ఉంచాలి. అలాగే రిఫ్రిజిరేటర్ లోపల కూరగాయల బాక్స్‌లో ఉంచాలి.

ఫ్రిజ్ లో ఆపిల్స్ పెట్టినప్పుడు కొద్దిగా తడిగా ఉన్న పేపర్‌లో చుట్టి, పాలిథిన్ సంచిలో ఉంచాలి. పాలిథిన్ సంచికి చిన్న చిన్న రంధ్రాలు చేయాలి.ఇలా చేస్తే చల్లని గాలి లోపలకు వెళ్ళుతుంది.

ఆపిల్స్ ని కూరగాయలు,ఇతర పండ్లతో కలిపి పెట్టకూడదు. ఎందుకంటే యాపిల్స్ ఇథిలీన్ వాయువును విడుదల చేస్తాయి. అందువల్ల ఇతర పండ్లు తొందరగా కుల్లిపోతాయి. ఆపిల్స్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా కొనుగోలు చేయాలి.

వార్తాపత్రిక లేదా క్రాఫ్ట్ పేపర్‌లో ఒక్కొక్కటిగా చుట్టి ఫ్రిజ్‌లో ఉంచితే చాలా కాలం పాటు నిల్వ చేయవచ్చు. ఫ్రిజ్ లో ఆపిల్స్ నిల్వ చేయటానికి అనువైన ఉష్ణోగ్రత 30 నుంచి 35 డిగ్రీల ఫారెన్‌హీట్.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.