Face Glow Tips:బ్యూటీ పార్లర్ కి వెళ్ళటానికి సమయం లేనివారు…ఇలా చేస్తే ముఖం తెల్లగా మెరిసిపోతుంది
Face Glow Tips:బ్యూటీ పార్లర్ కి వెళ్ళటానికి సమయం లేనివారు…ఇలా చేస్తే ముఖం తెల్లగా మెరిసిపోతుంది..వేసవికాలంలో చర్మానికి సంబంధించిన సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వేసవికాలంలో చర్మం జిడ్డుగా మారుతుంది. మొటిమలు, దురద, దద్దుర్లు వంటి అన్ని రకాల సమస్యలకు బియ్యం పిండి మంచి ఉపశమనం కలిగిస్తుంది. బియ్యం పిండి మనకు ఇంటిలో సులభంగా లభ్యం అవుతుంది.
ఒక స్పూన్ బియ్యప్పిండిలో రోజ్ వాటర్ వేసి బాగా కలిపి ముఖానికి రాసి ఐదు నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది స్క్రబ్బింగ్ వలె పనిచేస్తుంది. చర్మం మీద మురికి, దుమ్ము, ధూళి వంటి వాటిని తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
జిడ్డు చర్మం ఉన్నవారికి ఇప్పుడు చెప్పే ప్యాక్ చాలా బాగా సెట్ అవుతుంది. బియ్యం పొడిలో నిమ్మరసం, గ్రీన్ టీ వేసి బాగా కలిపి చర్మానికి రాయాలి. ఐదు నిమిషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. గ్రీన్ టీ చర్మాన్ని బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది. బియ్యం పొడి, చిటికెడు పసుపు మరియు విటమిన్ ఇ నూనెతో కలబంద జెల్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి.
ఇది మీ డల్ స్కిన్‌కి తిరిగి మెరుపును తెస్తుంది. అలాగే చర్మం తేమను కాపాడుతుంది. టాన్ తొలగించడానికి బియ్యం పొడిని కూడా ఉపయోగించవచ్చు. ఒక బౌల్ లో ఒక స్పూన్ బియ్యం పిండి,అరస్పూన్ తేనే, రెండు స్పూన్ల పాలను పోసి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి 5 నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. పొడి చర్మంతో ఇబ్బంది పడేవారికి కూడా ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.