Hair Growth:జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరగాలంటే సరికొత్త చిట్కా
Hair Growth:జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరగాలంటే సరికొత్త చిట్కా..ప్రస్తుతం ఉన్న పరిస్థితులు,సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం వంటి కారణాలతో జుట్టు రాలే సమస్య మనలో చాలా మందిలో కనిపిస్తుంది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే అసలు కంగారు పడకుండా ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా మంచి ఫలితం కనపడుతుంది.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో 5 స్పూన్ల సగ్గుబియ్యం వేసి 5 నిమిషాలు మరిగించి చల్లారిన తర్వాత ఒక బౌల్ లోకి వడకట్టాలి. దీనిలో 5 స్పూన్ల పెరుగు,ఒక స్పూన్ ఆముదం వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు అప్లై చేయాలి. అరగంట తర్వాత రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలటం తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.
అలాగే జుట్టు మృదువుగా కాంతివంతంగా మెరుస్తుంది. జుట్టు చివర్లు చిట్లటం తగ్గితుంది. సగ్గుబియ్యంలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్లకు బలాన్ని అందించి జుట్టు రాలకుండా చేస్తాయి. పెరుగు,ఆముదం జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి సహాయపడతాయి. వీటిని జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.