Beauty Tips

Pimples on Scalp: తలపై మొటిమలు.. ఇలా సులభంగా తొలగించుకోండి!

Pimples on Scalp: తలపై మొటిమలు.. ఇలా సులభంగా తొలగించుకోండి.. మొటిమలు అనేవి శరీరం, తల మీద చర్మం మరియు శరీరం యొక్క అనేక బాగాలపై కనపడతాయి. ఈ సమస్య వయస్సుతో నిమిత్తం లేకుండా అందరిలోనూ కనపడుతుంది.

జుట్టు మీద చనిపోయిన చర్మ కణాలు మరియు సిబం కలిసి తల మీద చర్మం మీద చర్మ రంద్రాలను మూసివేయటం వలన మొటిమలు ఏర్పడతాయి. ఈ మొటిమలను తగ్గించుకోవటానికి ఎన్నో ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఆ చిట్కాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

తమలపాకు
తమలపాకులో యాంటీమైక్రోబయాల్ మరియు క్రిమినాశక లక్షణాలు ఉండుట వలన మొటిమల చికిత్సలోసమర్ధవంతంగా పనిచేస్తుంది. తమలపాకులను పేస్ట్ చేసి ప్రభావిత ప్రాంతంలో రాసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజులో రెండు సార్లు చేయాలి.

రాత్రి పడుకొనే ముందు వెచ్చని తమలపాకును ప్రభావవంతమైన ప్రాంతంలో పెట్టి,మరుసటి రోజు శుభ్రం చేసుకోవాలి. రెండు లేదా మూడు కప్పుల నీటిలో మూడు లేదా ఐదు తమలపాకులను వేసి ఉడికించాలి. ఈ ద్రవం చల్లారిన తర్వాత వడకట్టి జుట్టును శుభ్రం చేయటానికి ఉపయోగించాలి.

తేనె
యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టిరియాల్ లక్షణాలు ఉండుట వలన మొటిమలను కలిగించే బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకోవటం మరియు ఎరుపు,వాపును సమర్ధవంతంగా తగ్గిస్తుంది.ప్రభావిత ప్రాంతంలో తేనెను రాసి పది నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ప్రతి రోజు ఈ విధంగా రెండు సార్లు చేయాలి. ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిలో రెండు స్పూన్ల తేనెను కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజుకి ఒకసారి చేసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.