DevotionalToday Rasi Phalalu In telugu

Rasi Phalalu:March 10 రాశి ఫలాలు… ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త…

March 10 Rasi Phalalu:March 10 రాశి ఫలాలు… ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త… ఈ మధ్య కాలంలో జాతకాలను నమ్మేవారు చాలా ఎక్కువగా కనపడుతున్నారు. మనలో కొంత మంది జాతకాలను నమ్ముతారు. మరి కొంత మంది జాతకాలను అసలు నమ్మరు. కొంతమంది ప్రతి రోజు వారి రాశి ఫలాలను చూసుకొని దానికి అనుగుణంగా అడుగులు వేస్తారు.

మేషరాశి
ఈ రాశి వారికి కొన్ని విషయాలలో మనో నిబ్బరం అవసరం. అనవసర ఖర్చులు ఎక్కువగా చేస్తారు. కీలకమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

వృషభ రాశి
ఈ రాశి వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మిధున రాశి
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధికమిస్తారు. ఒక విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. కొందరు వ్యక్తుల ప్రవర్తన కారణంగా కొంచెం బాధ కలుగుతుంది.

కర్కాటక రాశి
ఈ రాశి వారు చేసే ప్రతి పనిని ప్రణాళిక బద్ధంగా చేస్తారు. భక్తిశ్రద్ధతో పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది.

సింహరాశి
ఈ రాశి వారు అనుకున్న పనిని అనుకున్న విధంగా చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది.

కన్యా రాశి
ఈ రాశి వారు పట్టుదలగా ముందడుగు వేస్తారు. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ధైర్యంగా ఉండటం అలవాటు చేసుకోవాలి.

తులారాశి
ఈ రాశి వారికి ప్రారంభించిన పనులలో ఆటంకాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు.

వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం తో చేసే ప్రతి పని విజయాన్ని అందిస్తుంది. అవసరానికి సహాయం చేసేవారు ఉంటారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి.

ధనస్సు రాశి
ఈ రాశి వారు అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది.

మకర రాశి
ఈ రాశి వారు ముఖ్యమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కుంభరాశి
ఈ రాశి వారు కొన్ని కీలకమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి
ఈ రాశి వారు అనుకున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వివాదాలు పెట్టుకోకూడదు. ఆదాయం చాలా బాగుంటుంది.