Beauty Tips

Face Glow Tips:బ్యూటీ పార్లర్ కి వెళ్ళటానికి తీరిక,ఓపిక లేని వారు…ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది

Face Glow Tips:బ్యూటీ పార్లర్ కి వెళ్ళటానికి తీరిక,ఓపిక లేని వారు…ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది.. అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కాకపోతే పార్లర్ కి వెళ్ళే తీరిక,ఓపిక కొందరికి ఉండకపోవచ్చు.

అలాంటి వారి కోసం ఇంట్లోనే ఆచరించదగిన కొన్ని చిట్కాలను తెలుసుకుందాము. ఈ చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాస్త ఓపిక్గ చేసుకుంటే మెరిసే చర్మం సొంతం అవుతుంది.

నిమ్మరసం
ఇది చాలా తేలిక అయిన చిట్కా. ఒక స్పూన్ నిమ్మరసంలో కొన్ని చుక్కల తేనే కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత ముఖం కడుక్కొంటే మిలమిల మెరుస్తుంది. ఈ నిమ్మరసంలో కొద్దిగా శనగపిండి,చిటికెడు పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు శరీరం మొత్తం పట్టించి ఆరిన తర్వాత స్నానం చేస్తే మంచి పలితం కనపడుతుంది.

టమాటో రసం
టమాటో రసాన్ని స్నానానికి ముందు ముఖానికి పట్టించి బాగా ఆరనిచ్చి అనంతరం స్నానం చేస్తే మంచిది. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే టమోటాలో ఉండే లక్షణాలు నల్లని మచ్చలు,మొటిమలు అన్నింటిని తగ్గించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.

ఓట్ మీల్
ఓట్ మీల్,బాదం పప్పులను పొడి చేసి,దానిలో పాలు,తేనే కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు శరీరం మొత్తం పట్టించి ఆరిన తర్వాత స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

పాలు
ముఖం మీద మురికిని తొలగించటానికి పాలు బాగా ఉపకరిస్తాయి. రాత్రి పడుకోవటానికి ముందు పాలతో ముఖం మీద ఉన్న మురికిని తొలగించి అనంతరం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. పాలు చర్మ సౌందర్యాన్ని పెంపొందించటంలో చాలా సహాయపడుతుంది. చర్మం లోపలి దాక వెళ్లి మురికిని తొలగించటమే కాకుండా చర్మంను మెరిసేలా చేస్తుంది.

గందం పౌడర్
గందం పౌడర్ లో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాలలో మీకు నచ్చిన వాటిని ఫాలో అవ్వవచ్చు. ఇవన్నీ చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.