Kitchenvantalu

Anapakaya halwa sweet:ఆనపకాయ హల్వా ఇలా చేయండి.. ఆనపకాయ ఇష్టం లేని వారు కూడా వదలరు.

Anapakaya halwa sweet:ఆనపకాయ హల్వా ఇలా చేయండి.. ఆనపకాయ ఇష్టం లేనివారు కూడా వదలరు. ఈ హల్వా దాదాపుగా వారం రోజులు నిల్వ ఉంటుంది.

కావలసిన పదార్ధాలు
ఆనపకాయ : 1 మీడియం సైజు (తొక్క తీసి తురమాలి),
పంచదార: కప్పు,
కోవా: కప్పు,
పాలు: అరలీటరు,
ఎండుద్రాక్ష: పది,
నెయ్యి: 3 టీస్పూన్లు,
జీడిపప్పు: రుచికి సరిపడా,
యాలకులపొడి: టీస్పూను,
బాదంముక్కలు: టేబుల్‌ స్పూను,
గ్రీన్‌ఫుడ్‌కలర్‌: చిటికెడు

తయారుచేసే విధానం
ఆనపకాయపై తొక్క తీసేసి తురమాలి. ఈ తురుమును నీళ్లు తక్కువ పోసి ఉడికించాలి. తురుము మెత్తగా అయ్యాక నీటిని తీసేయాలి. నాన్‌స్టిక్‌ పాన్‌లో నెయ్యి వేసి బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేగించాలి.

ఆ తరవాత ఆనపకాయ తురుము వేసి పాలు పోసి, ఫుడ్‌కలర్‌ వేసి కలపాలి. పంచదార, కోవా వేసి దగ్గరగా ఉడికించి దించితే ఆనపకాయ హల్వా రెడీ.