Hair Care Tips:ఈ Gel వారంలో 1 సారి రాస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది
Hair Care Tips:ఈ Gel వారంలో 1 సారి రాస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.. జుట్టు రాలే సమస్య అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనపడుతుంది. వయస్సుతో సంబందం లేకుండా చాలా చిన్న వయస్సులోనే రావటం వలన కంగారు పడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. వాటి వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
మన వంటింటిలో ఉండే మెంతులు జుట్టు రాలకుండా చాలా బాగా సహాయపడుతుంది. మెంతులను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు. మెంతులను వేగించకుండా మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. మెంతుల పొడి మార్కెట్ లో కూడా లభ్యం అవుతుంది. రాత్రి సమయంలో రెండు స్పూన్ల మెంతి పిండిని నీటిని పోసి బాగా కలిపి అలా వదిలేయాలి.
మరుసటి రోజు ఉదయం మెంతి పిండిలో ఇంకా కొన్ని నీటిని పోసి బాగా కలిపి పలుచని వస్త్రం సాయంతో వడకట్టాలి. ఇలా చేయటం వలన Gel తయారవుతుంది. ఈ Gel ని వారానికి ఒకసారి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. నూనె రాసిన జుట్టుకు రాయకూడదు. అరగంట అయ్యాక సాదరణమైన నీటితో తలస్నానం చేయాలి.
మరుసటి రోజు ఉదయం కుంకుడు కాయలతో లేదా షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒక సారి నెల రోజుల పాటు చేస్తే చాలా మంచి ఫలితం కనపడుతుంది. మెంతులలో ఉన్న లక్షణాలు జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరగటానికి ప్రోత్సాహాన్ని అందిస్తాయి. అలాగే తల మీద చర్మం మీద ఇన్ ఫెక్షన్ లేకుండా చేస్తుంది.
జుట్టుకి మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. అలాగే చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది. జుట్టు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. తెల్లజుట్టును నల్లగా మార్చటంలో కూడా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఒక్క మెంతులను ఉపయోగించి జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య నుండి చాలా సమర్ధవంతంగా బయట పడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.