Face Glow Tips:ఇలా చేస్తే చాలు 40 లో కూడా 20 వలే యంగ్ లుక్ లో అందంగా మెరిసిపోతారు
Face Glow Tips:ఇలా చేస్తే చాలు 40 లో కూడా 20 వలే యంగ్ లుక్ లో అందంగా మెరిసిపోతారు.. మనలో చాలా మంది వయస్సు పెరిగినా సరే యంక్ లుక్ లో ఉండాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అయినా పెద్దగా ప్రయోజనం లేక ఎంతో నిరాశకు గురి అవుతూ ఉంటారు. మార్కెట్ లో వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టి క్రీమ్స్ కొనవలసిన అవసరం లేదు. ఇంటిలోనే సహజసిద్దంగా యంగ్ లుక్ లోకి మారవచ్చు.
పొయ్యి మీద ఒక గ్లాస్ నీటిని పోసి రెండు స్పూన్ల బాసుమతి రైస్ వేసి ఉడికించాలి. ఉడికిన బియ్యాన్ని,నీటిని కలిపి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో మూడు స్పూన్ల పాలు, ఒక స్పూన్ ఆలోవెరా జెల్,అరస్పూన్ కొబ్బరి నూనె,ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసి అన్నీ బాగా కలిసేలా బాగా కలపాలి.
ఈ మిశ్రమంను ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా పది రోజుల పాటు నిల్వ ఉంటుంది. రోజు విడిచి రోజు ఈ మిశ్రమంను ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా నెల రోజుల పాటు చేస్తే ముఖం మీద ముడతలు,మచ్చలు వంటివి అన్నీ తొలగిపోయి ముఖం యంగ్ లుక్ లో కన్పిస్తుంది.
ఈ మిశ్రమంలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ సహజసిద్దమైనవి. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.