white hair:ఇలా ఒక్కసారి స్ప్రే చేస్తే చాలు తెల్లజుట్టు నల్లగా మారటం ఖాయం
white hair:ఇలా ఒక్కసారి స్ప్రే చేస్తే చాలు తెల్లజుట్టు నల్లగా మారటం ఖాయం.. ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య, తెల్లజుట్టు సమస్య అనేవి వయస్సుతో సంబందం లేకుండా చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తున్నాయి. ఈ సమస్యలు రాగానే చాలా మంది కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే రకరకాల పొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి.
అదే ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఫలితం శాశ్వతంగా ఉంటుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం కనపడుతుంది. దీని కోసం ముందుగా 4 మందార పువ్వులు,4 మందార ఆకులను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోయాలి.
నీరు కాస్త వేడి అయ్యాక కట్ చేసి పెట్టుకున్న మందార పువ్వులు,ఆకులు వేయాలి. ఆతర్వాత ఒక స్పూన్ నల్ల బియ్యం, ఒక స్పూన్ మెంతులు వేసి 7 నుంచి 8 నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని ఒక బౌల్ లోకి వడకట్టాలి. కాస్త చల్లారాక ఒక స్పూన్ ఆముదం,ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి.
ఈ నీటిని ఒక స్ప్రే బాటిల్ లో పోసి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా కవర్ అయ్యేలా స్ప్రే చేయాలి. ఇలా చేశాక తలకు cap పెట్టుకొని గంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య, తెల్ల జుట్టు సమస్య అన్నీ తగ్గిపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.