Vankaya Perugu Pachadi Recipe:ఇలా కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి చేస్తే అందరికి నచ్చుతుంది
Vankaya Perugu Pachadi Recipe:ఇలా కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి చేస్తే అందరికి నచ్చుతుంది.. చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి అదిరిపోయే రుచితో ఉంటుంది.
కావలసిన పదార్థాలు:
పెద్ద వంకాయ – 1, అల్లం – అంగుళం ముక్క, పచ్చిమిర్చి – 4, జీలకర్ర – ఒక టీ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి – 2, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు – తిరగమోత కోసం, కరివేపాకు – 4 రెబ్బలు, పుల్లటి పెరుగు – 400 గ్రా., మిరియాలు – అర టీ స్పూను, కొత్తిమీర తరుగు – గుప్పెడు, పసుపు – అర టీ స్పూను.
తయారుచేసే విధానం: వంకాయను శుభ్రంగా కడిగి చాకుతో గాట్లు పెట్టి నూనె రాసి పొయ్యిమీద పెట్టి కాల్చాలి చల్లారిన తర్వాత పై తొక్క తీసేసి గుజ్జుల ఒక గిన్నెలో తీసుకోవాలి.
మూకుడులో నూనె వేసి కాస్త వేడెక్కాక ఎండుమిర్చి మినపప్పు ఆవాలు జీలకర్ర,శనగపప్పు కరివేపాకు పసుపు వేసి వేగించి వంకాయ గుజ్జు వేసి రెండు నిమిషాలు వేగించాలి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న కప్పులో తీసుకుని దానిలో పెరుగు కలపాలి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వంకాయ పెరుగు పచ్చడి రెడీ.