Hair Care Tips:వారంలో 2 సార్లు ఇలా చేస్తే చాలు జుట్టు రాలకుండా ఒత్తుగా,బలంగా పెరగటం ఖాయం
Hair Care Tips:వారంలో 2 సార్లు ఇలా చేస్తే చాలు జుట్టు రాలకుండా ఒత్తుగా,బలంగా పెరగటం ఖాయం.. జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య అనేవి ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో కనిపిస్తున్నాయి. ఈ సమస్య రాగానే అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. మన ఇంటిలో ఒక నూనె తయారు చేసుకుని వాడితే జుట్టు ఆరోగ్యంగా దృఢంగా పెరుగుతుంది. .
దీనికోసం బెంగళూరు మిర్చి అని పిలిచే capsicum ఉపయోగిస్తున్నాం. capsicum లో ఉన్న గుణాలు జుట్టు పెరుగుదలకు, జుట్టు బలంగా పెరగడానికి సహాయ పడుతుంది. ఒక క్యాప్సికమ్ తీసుకుని లోపల గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అర కప్పు ఆలివ్ ఆయిల్. లో క్యాప్సికం ముక్కలను వేయాలి.
స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టి నీటిని పోసి కాస్త వేడెక్కాక ఆ నీటిలో ఆలివ్ ఆయిల్ వేసి ముక్కలు ఉన్న గిన్నె పెట్టి నూనె బాగా వేడెక్కే వరకు ఉంచాలి. ఆ తర్వాత ఆ నూనెను చల్లార్చాలి. ఈ నూనెను ఒక glas జార్ లో వేసుకుని మూత పెట్టి వెలుగు, వేడి తగలని ప్రదేశంలో ఒక వారం రోజుల పాటు అలాగే వదిలేయాలి.
ఇలా చేయడం వల్ల capsicum లో ఉండే ఆయుర్వేద లక్షణాలు అన్నీ నూనెలోకి చేరతాయి. ఒక వారం తర్వాత ఈ నూనెను వడగట్టి జుట్టుకు బాగా పట్టించి మసాజ్ చేయాలి.. అరగంట అయ్యాక రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తుంటే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య లేకుండా జుట్టు బలంగా ఆరోగ్యంగా దృఢంగా పెరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.