Face Glow Tips:ఫంక్షన్ కి వెళ్ళే 10 నిమిషాల ముందు ఇలా చేస్తే ముఖం తెల్లగా,కాంతివంతంగా మెరుస్తుంది
Face Glow Tips:ఫంక్షన్ కి వెళ్ళే 10 నిమిషాల ముందు ఇలా చేస్తే ముఖం తెల్లగా,కాంతివంతంగా మెరుస్తుంది..ఫంక్షన్ కి వెళ్లినప్పుడు ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవాలంటే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు.
వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మన ఇంటిలో ఉన్న సహజసిద్దమైన పదార్ధాలతో ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది.
దీని కోసం ఒక బౌల్ లో ఒక స్పూన్ గంధం పొడి, ఒక స్పూన్ ఆలోవెరా జెల్, ఒక స్పూన్ పాలను పోసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలు అయ్యాక ముఖం మీద నీటిని చల్లి ముఖాన్ని రబ్ చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా చేస్తే కేవలం పది నిమిషాల్లోనే ముఖం తెల్లగా,కాంతివంతంగా మెరుస్తుంది. గంధంలో తేలికపాటి ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలు ఉండుట వలన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇది మీ చర్మంపై నల్ల మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుంది. టాన్ తొలగించడానికి చాలా సమర్థ వంతముగా పనిచేస్తుంది.
ఆలోవెరా చర్మంలో మృత కణాలను తొలగించి ముఖం మెరిసేలా చేస్తుంది. పాలల్లో ఉన్న లక్షణాలు ముఖం మీద చర్మానికి పోషణ అందిస్తుంది. ఈ ప్యాక్ అన్నీ చర్మ తత్వాలకు సెట్ అవుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.