Banana With Ghee:పరగడుపున అరటిపండు, నెయ్యి కలిపి తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా ?
Banana With Ghee:పరగడుపున అరటిపండు, నెయ్యి కలిపి తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా..అరటిపండు సంపూర్ణ ఆహారం కాగా, నెయ్యి శరీరానికి బలాన్ని ఇవ్వడంతో పాటు అనేక వ్యాధులను దూరం చేస్తుంది.
ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు చెప్పుతున్నారు. అరటిపండు తింటే శరీరానికి తగినంత ప్రోటీన్, ఫైబర్ మరియు విటమిన్లు లభిస్తాయి.
అలాగే శారీరక బలహీనతను తొలగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. అరటిపండులో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే నెయ్యిలో కూడా ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తింటే రెట్టింపు ప్రయోజనాలు కలగటమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి,ఆందోళన వంటివి తగ్గుతాయి.
బాగా పండిన అరటిపండును గుజ్జుగా చేసి దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి తినాలి. ఉదయం పరగడుపున తింటే మంచిది. ఉదయం సమయంలో తింటే అలసట,నీరసం వంటివి లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. అలాగే కండరాలు దృఢంగా ఉండి వాటి పనితీరు బాగుంటుంది. నెయ్యిలో ఉండే విటమిన్ D ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అరటిపండులో ఫైబర్ అధికంగా ఉండుట వలన గ్యాస్, మలబద్దకం,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. అరటిపండు మరియు నెయ్యిలో ఉండే ప్రొటీన్లు బరువు తక్కువ ఉన్నవారిలో బరువును పెంచుతాయి.
అరటిపండు మరియు నెయ్యి చర్మానికి చాలా మేలును చేస్తాయి. అరటిపండు మరియు నెయ్యి తినడం వల్ల చర్మ కణాలను పునరుజ్జీవింపజేస్తుంది, ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది, చర్మంపై సహజమైన మెరుపును తెస్తుంది, అలాగే చర్మం మెరుస్తూ మరియు అందంగా మారుతుంది. కాబట్టి అరటిపండు, నెయ్యి కలిపి తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.