Kitchenvantalu

Ink Stains:బట్టలు మీద పడిన ink మరకలు కేవలం 5 నిమిషాలలో పోగొట్టండి

Ink Stains from Clothes:బట్టలు మీద పడిన ink మరకలు కేవలం 5 నిమిషాలలో పోగొట్టండి.. పిల్లల యూనిఫాంపై ఇంకు మరకలు పడటం అనేది సాదారణంగా జరిగేదే. వాటిని తొలగించటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే వాటిని తొలగించటానికి ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి.

ఒక బౌల్ లో రెండు స్పూన్ల బేకింగ్‌ సోడా తీసుకొని కొంచెం నీటిని కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రంమలో కాటన్ బాల్ ని నానబెట్టి, మరక మీద కాటన్ బాల్ తో రుద్దాలి. ఆ తర్వాత మామూలు డిటర్జైెంట్‌తో దుస్తులను ఉతకాలి.

పావుకప్పు వైట్‌ వెనిగర్‌కు కొంచెం నీటిని కలిపి ఇంక్‌ పడిన వస్త్రంపై వేసి అరగంట పాటు నానబెట్టాలి. మధ్య మధ్యలో ఆ మిశ్రమంతో తడుపుతూ ఉండాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఇంక్‌ మరకలను వదిలించడంలో వైట్‌ వెనిగర్‌ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

ఉప్పు కూడా సిరా మరకలను తొలగించటానికి సహాయపడుతుంది. మరకపై కొంచెం ఉప్పు వేసి దానిపై తడి వస్త్రాన్ని 10 నిమిషాలు ఉంచి ఆపై ఉతకాలి.

జీన్స్‌పై సిరా మరకలను తొలగించడానికి నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌ని ఉపయోగించొచ్చు. ఇందులోని ఆల్కహాల్‌ ఇంక్‌ మరకలను వదిలిస్తుంది. చివర్లో సబ్బుతో ఉతికితే చాలు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News