Kitchenvantalu

Tomato Masala Oats: ట‌మాటాలు, ఓట్స్ క‌లిపి ఇలా చేస్తే… రుచితో పాటు ఆరోగ్యం కూడా..

Tomato Masala Oats: ట‌మాటాలు, ఓట్స్ క‌లిపి ఇలా చేస్తే… రుచితో పాటు ఆరోగ్యం కూడా.. ఇడ్లీ ,దోస,వడ,మార్నింగ్ టిఫిన్స్ బోర్ కొట్టినా, లేదంటే మీరు డైటింగ్ లో ఉన్నా.. ఈజీగా చేసుకునే ఓట్స్ టమాటో కలిపి ట్రై చేయండి.

కావాల్సిన పదార్ధాలు
నూనె – 1 టేబుల్ స్పూన్
టమాటో – 3
ఉల్లిపాయ- 1
కరివేపాకు – 2 రెమ్మలు
వేపుకున్న ఓట్స్ – 1 కప్పు
నీళ్లు – 250ml -300 ml
ఉప్పు – తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
కారం – 1 టేబుల్ స్పూన్
పసుపు – ¼ టేబుల్ స్పూన్
మిరయాల పొడి – ¼ టేబుల్ స్పూన్
గరంమసాలా- ¼ టేబుల్ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేసి అందులోకి ఉల్లిపాయ తరుగు ,కరివేపాకు వేసి ఫ్రై చేసుకొండి.
2.ఉల్లిపాయలు వేగాక ఉప్పు,పసుపు,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి.
3.వేగిన అల్లం వెల్లుల్లి లోకి టమాటో ముక్కలు వేసి గుజ్జుక ఉడకనివ్వాలి.

4.మగ్గిన టమాటోలో నీళ్లు పోసి హై ఫ్లేమ్ పై మరగనివ్వాలి.
5.మరుగుతున్న టమాటాలో కారం,ఓట్స్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
6.తరువాత మూతపెట్టి మీడియం ఫ్లేమ్ పై దగ్గర పడుతుండగా మిరియాల పొడి,గరం మసాలా,కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే.