Holi Color Stains: ముఖం,శరీరంపై పడిన హోలీ మరకలు పోవాలంటే.. ఇలా చేయండి!
Holi Color Stains: ముఖం,శరీరంపై పడిన హోలీ మరకలు పోవాలంటే.. ఇలా చేయండి.. రంగుల పండుగ రానే వచ్చింది. ఈ సమయంలో ప్రతీఒక్కరూ కలర్స్ చల్లుకుంటూ హాయిగా గడిపేస్తారు. దగ్గరివారు, ఇష్టమున్న వారు ఎవరిపైనైనా సరే కలర్స్ పూసి ఎంజాయ్ చేస్తుంటారు.
అలాంటివారు ముందుగానే జాగ్రత్తలు తీసుకోకపోతే ఒంటిపై పడిన రంగులు త్వరగా పోవు, ఒకవేళ ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే కలర్స్ పోగొట్టుకోవడానికి ఏంచేయాలో చూద్దాం.రంగులు త్వరగా పోవాలంటే ఇలా చేయండి..
* ఒంటిపై పడిన రంగులు త్వరగా పోవాలంటే కలర్స్ పడిన వెంటనే వాటిని నీటితో కడగాలి. ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే అంత ఎక్కువ సమయం అలానే ఉంటాయి.
* గోరువెచ్చని నీటితో కడగడం వల్ల రంగులు ఈజీగా పోతాయి.
* గ్లిజరిన్, సీ సాల్ట్ కలపాలి. ఇందులో కొన్ని చుక్కుల ఏదైనా అరోమా ఆయిల్ వేసి మంచి స్క్రబ్‌లా చేసి రాస్తే వ్రగా కలర్స్ పోతాయి.
* ఏదైనా ఆయిల్ రాస్తే దాంతో ఈజీగా పోతాయి. కిరోసిన్ రాసినా పోతాయి. కానీ అది శరీరానికి అంత మంచిది కాదు.
* క్లీన్ చేసుకున్న వెంటనే మాయిశ్చరైజ్ క్రీమ్ రాయడం మరిచిపోవద్దు.
* హెయిర్‌ని ఖచ్చితంగా మైల్డ్ షాంపుతో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆలీవ్ ఆయిల్, తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇది జుట్టుకి చాలా మంచిది.
అయితే, సహజసిద్ధమైన రంగుల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే మనం కెమికల్స్‌తో కూడిన రంగులు వాడతామో అప్పుడే ఈ ఇబ్బంది. కాబట్టి.. వీలైనంత వరకూ సహజసిద్ధమైన రంగులతో పండుగ చేసుకోండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.