White Hair Turn Black:ఈ ఆకును నూనెలో మరిగించి జుట్టుకి రాస్తే తెల్లజుట్టు సమస్య తొలగిపోతుంది
White Hair Turn Black:ఈ ఆకును నూనెలో మరిగించి జుట్టుకి రాస్తే తెల్లజుట్టు సమస్య తొలగిపోతుంది.. జుట్టు రాలే సమస్య, తెల్లజుట్టు సమస్య అనేవి ఈ రోజుల్లో చాలా ఎక్కువగా కనపడుతుంది.
ఈ సమస్యలు రాగానే చాలా మంది కంగారూ పడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. అలా కాకుండా ఇంటిలో ఉండే సహజసిద్దంగా దొరికే వస్తువులతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
మనం ప్రతి రోజు కూరల్లో వాడే కరివేపాకు జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. ఒక కప్పు కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకు ఆకులను వేసి పొయ్యి మీద పెట్టి కరివేపాకు ఆకులు బాగా వేగే వరకు ఉంచి ఆ తర్వాత పోయి మీద నుంచి దించి ఆ నూనెను వడకట్టాలి.
ఈ నూనె దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ నూనెను ప్రతి రోజు జుట్టుకి పట్టిస్తే క్రమంగా జుట్టు రాలే సమస్య,తెల్లజుట్టు సమస్య తగ్గిపోతాయి. ప్రతి రోజు రాస్తేనే మంచి ఫలితం వస్తుంది. కరివేపాకు జుట్టు రాలే సమస్యను తగ్గించి ఒత్తుగా పెరిగేలా ప్రాసెస్ చేస్తుంది. కరివేపాకులో ప్రోటీన్ కంటెంట్ మరియు బీటా కెరోటిన్ కంటెంట్ రెండూ పుష్కలంగా ఉంటాయి.
ఇవి జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి. కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మరియు నెత్తిమీద తేమ మరియు చనిపోయిన జుట్టు కుదుళ్లను తొలగిస్తాయి. కరివేపాకులో అమైనో ఆమ్లాలతో సమృద్ధిగా ఉంటాయి, ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి మరియు వాటిని ఆరోగ్యంగా ఉంచుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.