Kitchenvantalu

Raw Mango Jam:మాంగో జామ్ ఇలా చేసుకుంటే చాలా రోజులు నిల్వఉంటుంది

Raw Mango Jam:మాంగో జామ్ ఇలా చేసుకుంటే చాలా రోజులు నిల్వఉంటుంది.. ప్రస్తుతం పచ్చి మామిడి కాయలు చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి. వీటితో ఈ విధంగా jam తయారుచేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

కావాల్సిన పదార్ధాలు
పచ్చిమామిడి కాయ – 3 స్లైసెస్
చక్కెర – రుచికి సరిపడ ఆ
యాలకుల పొడి – ½ టీ స్పూన్
నీళ్లు – 3 గ్లాసులు

తయారీ విధానం
1.పచ్చిమామిడికాయలను నీళ్లలో వేసి మెత్తపడే వరకు ఉడికించుకోవాలి.
2.ప్రెషర్ కుక్కర్ లో అయితే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
3.ఉడికిన మామిడికాయలను చల్లారకా తొక్క తీసుకోవాలి.
4.ఇప్పుడు మామిడి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
5.గుజ్జును మిక్సి జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు.

6.గుజ్జు కు సరిసమానంగా చక్కెర ను యాడ్ చేసుకోని లో ఫ్లేమ్ పై చక్కెర కరిగివరకు ఉడికించాలి.
7.చక్కెర కరిగాక చిక్క పడేవరకు ఉడికిస్తు అంటుకోకుండా కలుపుతూ ఉడికించాలి.
8.గుజ్జు చిక్క పడ్డాక యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
9.పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటేనర్ గాజు సీసాలో వేసుకోని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి.