Onion Cutting Tips:ఉల్లిపాయలు కోసినప్పుడు కన్నీరు వస్తోందా… రాకుండా ఉండాలంటే…
Onion Cutting Tips:ఉల్లిపాయలు కోసినప్పుడు కన్నీరు వస్తోందా… రాకుండా ఉండాలంటే… ప్రతిరోజు మనం వంటగదిలో ఉల్లిపాయను తప్పనిసరిగా వాడతాము. మనం చేసే వంటలకు ఉల్లిపాయ మంచి రుచిని అందిస్తుంది. అలాగే ఉల్లిపాయను కట్ చేసినప్పుడు మాత్రం కన్నీరు కచ్చితంగా వస్తాయి అలా కన్నీరు రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ఉల్లిపాయలను కొయటనికి ముందు పావుగంట సేపు ఫ్రిజ్లో ఉంచితే కంటి నుండి నీరు రాదు. ఎందుకంటే ఫ్రిజ్లో పెట్టినప్పుడు .ఉల్లిపాయల రియాక్షన్ తగ్గుతుంది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కట్ చేస్తే ఎక్కువ వాయువులు విడుదల అయ్యి కంటి నుండి నీరు వస్తుంది.
ఉల్లిపాయలను కోసేటప్పుడు వేగంగా తిరిగే .ఫ్యాన్ కింద కూర్చోవాలి లేదా గాలి బయటకు వెళ్లే మార్గంలో కూర్చుని కోస్తే ఉల్లిపాయ నుండి విడుదలయ్యే వాయువులు కంటికి దూరంగా వెళ్లి పోతాయి. బాగా Sharp గా ఉన్న చాకుతో కట్ చేస్తే ఉల్లిపాయ కణాలు తక్కువ డ్యామేజ్ అయ్యి తక్కువ మొత్తంలో వాయువు విడుదల అవుతుంది
ఉల్లిపాయ వేరు భాగంలో ఎక్కువ గాఢత కలిగిన ఎంజైమ్స్, సల్ఫ్యూరిక్ పదార్థాలు ఉంటాయి. అందువల్ల ముందుగా వేరు భాగాన్ని కట్ చేసి ఆ తర్వాత ఉల్లిపాయ మిగతా భాగాన్ని కట్ చేయాలి. ఉల్లిపాయ పైభాగాన్ని కింద భాగాన్ని కట్ చేసి నీటిలో పది నిమిషాల పాటు ఉంచితే ఉల్లిపాయలోని వాయువులు నీటిలోకి చేరి ఉల్లిపాయ కోసినప్పుడు కన్నీరు రాదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.