Body odor:చెమట వాసనకు చెక్ పెట్టాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి
Body odor:చెమట వాసనకు చెక్ పెట్టాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి.. మనలో చాలా మంది చెమట వాసన తో చాలా ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి వేసవి కాలంలో మాత్రమే ఈ సమస్య ఉంటుంది.
మరికొంతమందికి వేసవి కాలం లోనే కాకుండా చలి కాలంలో కూడా విపరీతంగా చెమటలు పట్టిస్తూ ఉంటాయి. చెమట రావడం వలన ఎటువంటి నష్టమూ లేదు.
కానీ చెమట కారణంగా వచ్చే దుర్వాసన పక్కన వారిని కూడా ఇబ్బంది పెడుతుంది.
ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చెమట వాసన నుండి బయటపడవచ్చు. నిమ్మరసం చెమట వాసనను తొలగించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. స్నానం చేసే నీటిలో అర చెక్క నిమ్మరసం కలిపి చేస్తే చెమట వాసన కు చెక్ పెట్టవచ్చు.
అలాగే యాంటీబ్యాక్టీరియల్ సోపు ని వాడుతూ ఉండాలి. బాగా వాసన వచ్చే పౌడర్ మరియు మాయిశ్చరైజర్ వంటి వాడకాన్ని తగ్గించాలి. అలాగే చెమట వాసన తగ్గడానికి గ్రీన్ టీ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. స్నానం చేసే నీటిలో గ్రీన్ టీ వేసుకుని స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. .
అలాగే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా అనేది ఉంటుంది. కాబట్టి తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. అంటే మసాలా వంటకాలు, ఆల్కహాల్, రెడ్ మీట్ వంటి వాటికి కాస్త దూరంగా ఉండాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.