Sorakaya Pappu:సొరకాయ పప్పు చాలా ఈజీగా కమ్మగా త్వరగా చేసేయవచ్చు
Sorakaya Pappu:సొరకాయ పప్పు చాలా ఈజీగా కమ్మగా త్వరగా చేసేయవచ్చు.. ప్రతి ఇంట్లో వారంలో నాలుగు సార్లైనా పప్పు కంపల్సరీగా చేసుకుంటాం. అందులో పప్పు కామన్ అయినా ..అందులో వేసుకునే కూరగాయాలు కాస్తా మార్చాం అనుకోండి. తినేవాల్లకి బోర్ కొట్టకుండా ఉంటుంది.ఈ సారి పప్పు సొరకాయ తో ట్రై చేయండి.
కావాల్సిన పదార్ధాలు
సొరకాయ ముక్కలు -3 కప్పులు
ఉల్లిపాయ తరుగు – 1
నానబెట్టిన కందిపప్పు – ¾ కప్పు
నానబెట్టిన పెసరపప్పు – ¼ కప్పు
పసుపు – ¼ టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి – 2
నీళ్లు – 3 కప్పులు
ఉప్పు – రుచికి సరిపడా
నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర – ¼ కప్పు
తాలింపు కోసం..
నెయ్యి /నూనె – 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
ఇంగువ – 2 చిటికెలు
చల్ల మిరపకాయలు – 2
దంచిన వెల్లుల్లి – 2
తయారీ విధానం
1.కుక్కర్ లో ఉప్పు,నిమ్మరసం,కొత్తి మీర తప్పా మిగిలిన పదార్ధాలన్ని వేసి మూడు విజల్స్ వచ్చే దాక ఉడికించుకోవాలి.
2.ఉడికిన పప్పును పప్పుగుత్తి సాయంతో మెత్తగా మెదుపుకోవాలి.
3.ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నెయ్యి/ నూనె వేడి చేసి తాలింపులు వేసి వేగిన తాలింపును పప్పులో కలుపుకోవాలి.
4.తాలింపు కలుపుకున్న పప్పులో నిమ్మరసం,ఉప్పు ,కొత్తి మీర వేసి బాగా కలుపుకోవాలి అంతు పప్పు సొరకాయ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News