Face Glow Tips:40 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల యంగ్ లుక్ ముడతలు,నల్లని మచ్చలు అన్ని మాయం
Face Glow Tips:40 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల యంగ్ లుక్ ముడతలు,నల్లని మచ్చలు అన్ని మాయం.. మనలో చాలా మంది ముఖం ముడతలు,మచ్చలు లేకుండా కాంతివంతంగా మెరుస్తూ ఉండాలని కోరుకోవటం సహజమే.
దాని కోసం ఎంత ఖర్చు పెట్టటానికి అయిన రెడీగా ఉంటారు. అయితే పెద్దగా ఖర్చు లేకుండా ఇంటిలో ఉన్న వస్తువులతో సులభంగా ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు.
దీని కోసం కేవలం మూడే మూడు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. ముందుగా బంగాళాదుంపను ఉడికించి మెత్తని పేస్ట్ గా చేసుకొని దానిలో 2 స్పూన్ల నిమ్మరసం,ఒక స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది.
బంగాళాదుంపలో వివిధ రకాల అవసరమైన ఖనిజాలు ఉన్నాయి, ఇవి వివిధ చర్మ సమస్యలతో పోరాటం చేయటానికి సహాయపడతాయి. బంగాళా దుంప చర్మం కాంతివంతంగా మార్చేందుకు సహాయపడుతుంది. చర్మం మీద మృత కణాలను తొలగించి చర్మం మీద నల్లని మచ్చలు లేకుండా మెరిసేలా చేస్తుంది.
నిమ్మరసంలో ఆల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్ ఉండుట వలన నిస్తేజమైన చర్మ కణాలను తొలగించి కొత్త వాటిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక రకమైన ఎక్స్ ఫోలియెంట్ గా పని చేస్తుంది. అంతేకాక విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన చర్మ సమస్యలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
తేనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. చర్మం మీద నల్లని మచ్చలు,మొటిమలు లేకుండా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. చర్మానికి తేమను అందిస్తుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయితే ముఖం మీద నల్లని మచ్చలు,ముడతలు లేకుండా 40 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల యంగ్ లుక్ తో కనపడతారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.