Cashew Nuts And pistachio:పిస్తా పప్పు Vs జీడిపప్పు… ఏది తింటే ఆరోగ్యానికి మంచిది…నమ్మలేని నిజాలు
Cashew Nuts And pistachio:పిస్తా పప్పు Vs జీడిపప్పు… ఏది తింటే ఆరోగ్యానికి మంచిది…నమ్మలేని నిజాలు.. డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయి. అలాగే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను కలిగి ఉంటాయి.
అయితే ఈ రోజు మనం జీడిపప్పు, పిస్తా ఆరోగ్యానికి ఏది మంచిది అనే విషయాన్నీ డిస్కస్ చేస్తున్నాం. జీడిపప్పు,పిస్తా రెండు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్స్,ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. పిస్తాలో పోషకాలు అధికంగా ఉన్నప్పటికీ,జీడిపప్పు కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
ఒక ఔన్స్ జీడిపప్పు లో 157 కేలరీలు, 5.7 గ్రాముల ప్రోటీన్; 8.6 గ్రాముల కార్బోహైడ్రేట్, 0.9 గ్రాముల ఫైబర్ మరియు 12.4 గ్రాముల కొవ్వు, 2.2 గ్రాముల సంతృప్త కొవ్వులు ఉంటాయి. అదే ఒక ఔన్స్ పిస్తా పప్పులో 159 కేలరీలు,5.8 గ్రాముల ప్రోటీన్; 2.8 గ్రాముల ఫైబర్, 7.8 గ్రాముల కార్బోహైడ్రేట్; 12.9 గ్రాముల కొవ్వు, 1.6 గ్రాముల సంతృప్త కొవ్వులు ఉంటాయి.
పిస్తాపప్పులో జీడిపప్పు కంటే ఎక్కువ ఫైబర్ మరియు తక్కువ సంతృప్త కొవ్వు ఉంటాయి, ఇవి ఆరోగ్యకరమైన ఎంపికగా మారుతాయి. పిస్తా పప్పులో జీడిపప్పు కంటే ఎక్కువ విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. పిస్తా పప్పుతో పోలిస్తే జీడిపప్పులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి పిస్తా సహాయాపడుతుంది.
జీడిపప్పులో ఎక్కువ మొత్తంలో సంతృప్త కొవ్వులు ఉండుట వలన గుండె ఆరోగ్యానికి జీడిపప్పును రికమెండ్ చేయరు న్యూట్రీషియన్స్. పిస్తా పప్పును రెగ్యులర్ గా తింటే చెడు కొలస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది. దాంతో గుండె సమస్యలు ఏమి లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పిస్తా పప్పులో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, అసంతృప్త కొవ్వులు, విటమిన్ ఇ, ఫైబర్, ప్లాంట్ స్టెరాల్స్ మరియు ఎల్-అర్జినిన్ ఉండుట వలన గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో తేలింది.
జీడిపప్పుతో పోలిస్తే పిస్తాపప్పులో యాంటీ ఆక్సిడెంట్ ఫ్లవనాయిడ్స్ ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. పిస్తాలో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండటం వలన క్యాన్సర్ ప్రమాదం మరియు గుండె ప్రమాదాల రిస్క్ ని తగ్గిస్తుంది. 100 గ్రాముల జీడిపప్పులో 1.99 మిల్లీగ్రాముల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
అదే 100 గ్రాముల పిస్తాలో అయితే 18 మిల్లీగ్రాముల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. పిస్తాలో కొలెస్ట్రాల్‌ను తగ్గించగల సమ్మేళనాలు ఫైటోస్టెరాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు 100 గ్రాముల పిస్తాలో280 మిల్లీగ్రాములు ఉంటే, 100 గ్రాముల జీడిపప్పులో 138 మిల్లీగ్రాములు ఉంటుంది. పిస్తా మరియు జీడిపప్పు వంటి నట్స్ లో పోషణ మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.