Mango:మామిడి పండును కోయకుండానే…పుల్లనివా.. తీపివా అని ఇలా తెలుసుకోండి..
Mango:మామిడి పండును కోయకుండానే…పుల్లనివా.. తీపివా అని ఇలా తెలుసుకోండి.. ఈ వేసవికాలం సీజన్లో మామిడి పండ్లు చాలా విరివిగా లభ్యమవుతాయి. మామిడిపండ్లలో ఎన్నో రకాలు మనకు అందుబాటులో ఉంటున్నాయి.
బంగినపల్లి, సువర్ణ రేఖ పెద్ద రసాలు, చిన్న రసాలు ఇలా రకరకాల మామిడి పండ్లు లభిస్తాయి. మామిడికాయలలో పుల్లగా ఉన్న వాటితో ఆవకాయ పెడుతూ ఉంటారు. తీయగా ఉన్న పళ్ళను పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు.
అయితే మామిడికాయను కోయకుండా చూడగానే తియ్యగా ఉంటుందా పుల్లగా ఉంటుందా తెలుసుకోవాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. మామిడి పండులో ఎన్నో భాషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మామిడిపండు పైభాగం, మధ్యభాగం, చివరన ఉండే విధానాన్ని బట్టి మామిడిపండు పుల్లగా ఉందా తియ్యగా ఉందా అనేది తెలుసుకోవచ్చు.
మామిడిపండు పై భాగంలో తొడిమ ప్రాంతంను పరిశీలనగా చూస్తే తొడిమె కొంత లోతుగా ఉంటే ఆ మామిడిపండు తీయగా ఉంటుంది. మామిడిపండు అడుగు భాగంలో పొడి చర్మం లేదా ముదురు రంగు లేదా నలుపు రంగులో ఉంటే మాత్రం ఆ మామిడిపండు తాజా మామిడిపండు కాదని అర్థం చేసుకోవాలి.
మామిడిపండు తొడిమ ప్రాంతంలో వాసన చూస్తే తీపి వాసన వస్తే అది తీయని మామిడిపండుగా భావించవచ్చు.మామిడిపండు మధ్యలో ఎక్కడో ఒక చోట నొక్కినపుడు
స్వల్ప ఒత్తిడికే ఆ మామిడిపండు మెత్తగా, రసంగా అవుతుంటే అది పండిన మామిడిపండు తియ్యగా ఉంటుంది.
అలా కాకుండా మీరు పండును నొక్కినపుడు మెత్తగా సాగుతున్నట్లుగా లోపలకు జారుతుంటే అది కృత్రిమంగా పండించిన మామిడిపండు అని అర్థం చేసుకోవాలి. ఇవి పుల్లగా లేదా రుచిలో చప్పగా ఉండే అవకాశం ఉంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.