Diabetes Food:డయాబెటిస్ ఉన్నవారు క్యారెట్ తింటే ఏమి అవుతుందో తెలుసా ?
Diabetes Food:డయాబెటిస్ ఉన్నవారు క్యారెట్ తింటే ఏమి అవుతుందో తెలుసా.. డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. అలాగే తీసుకొనే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవారికి ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఇక డయాబెటిస్ ఉన్నవారు క్యారెట్ తింటే ఏమి అవుతుందో చూద్దాం. క్యారెట్‌లోని కెరోటినాయిడ్స్ డయాబెటిక్ కారణంగా వచ్చే కంటి సమస్యల నుండి కాపాడుతుంది.
కెరోటినాయిడ్స్ అనేవి నారింజ మరియు పసుపు రంగు పండ్లు మరియు కూరగాయల్లో ఉంటాయి. అంతేకాక వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కంటి రెటీనా దెబ్బతినకుండా కాపాడతాయి. క్యారెట్ లో బీటా కెరోటిన్, ఆల్ఫా కెరోటిన్ లు ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. క్యారెట్ లో ఉండే కార్బో హైడ్రేడ్స్ ఆరోగ్యకరమైనవి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా సహాయపడతాయి.
డయాబెటిస్ ఉన్నవారిలో వచ్చే కంటి సమస్యలు,కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు,స్ట్రోక్ వంటివి రాకుండా కాపాడుతుంది. క్యారెట్ లో ఉండే విటమిన్ A ప్యాంక్రియాస్‌లో మరియు బీటా కణాల ఉత్పత్తిలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. క్యారెట్ గ్లైజమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే క్యారెట్ పచ్చిగా కాకుండా ఉడికించి తింటే మంచిది.
క్యారెట్ లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మరియు ఇన్సులిన్ నిరోధకత మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం చేసి మధుమేహాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. కాబట్టి రోజుకి ఒక క్యారెట్ తింటే డయాబెటిస్ ఉన్నవారికి మంచి ప్రయోజనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.