Nails Cleaning tips:కాలి గోర్లు మురికిగా, నల్లగా ఉన్నాయా..ఇలా చేస్తే నిమిషంలో మెరిసిపోతాయి
Nails Cleaning tips:కాలి గోర్లు మురికిగా, నల్లగా ఉన్నాయా..ఇలా చేస్తే నిమిషంలో మెరిసిపోతాయి.. కాలి గోర్లు మురికిగా, నల్లగా మారినప్పుడు ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. కాస్త ఓపిక,శ్రద్ద పెడితే సరిపోతుంది.
మనం ప్రతి రోజు టూట్ పేస్ట్ వాడుతూ ఉంటాం కదా…ఈ టూట్ పేస్ట్ ఉపయోగించి నల్లగా మారిన గోర్లను తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. గోర్లపై టూట్ పేస్ట్ రాసి రుద్ది 5 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేయాలి. అంతే నల్లగా మురికిగా మారిన గోర్లు తెల్లగా మారతాయి.
షాంపూ కూడా మురికిని తొలగించటానికి సహాయపడుతుంది. ఒక బకెట్ లో గోరువెచ్చని నీటిని పోసి దానిలో షాంపూ వేసి బాగా కలిపి ఆ నీటిలో పాదాలను పెట్టి పది నిమిషాలు అయ్యాక టూత్ బ్రష్‌తో గోళ్లను స్క్రబ్ చేసి శుభ్రం చేసుకోవాలి.
శనగపిండిలో నిమ్మరసం కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని గోర్లపై రాసి పది నిమిషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి. శనగపిండి మంచి స్క్రబింగ్ గా పనిచేస్తుంది. మురికిని తొలగించటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.